![]() |
![]() |
.webp)
సీనియర్ నటుడు నరేష్, పవిత్ర గురించి అందరికీ తెలుసు. ఆమెను పెళ్లి చేసుకున్న విషయం అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది కూడా. నరేశ్, పవిత్ర ఇద్దరూ దాదాపు ఐదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. అలాంటి నరేష్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పెళ్ళికి సంబందించిన కొన్ని విషయాలను వెల్లడించారు. "వీళ్ళు మంచివాళ్ళు , వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఏమీ లేదు. ఈరోజున సగం ప్రపంచం అంతా డివోర్స్ ప్రాబ్లమ్స్ తో సతమతమవుతోంది. ఎవరికీ వాళ్ళు ఇండిపెండెంట్ ఇపోయారు.
కాబట్టి 70 నుంచి 80 శాతం మంది మారిటల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బందులు పడుతున్నారు. మంచి, చెడులను పక్కన పెడితే ఇద్దరి మధ్య అనుబంధం ఉండాలి. తోడు లేకుండా ఉండలేమా అంటే ఉండొచ్చు కానీ 40 , 50 ఏళ్ళ వయసు తర్వాతే తోడు అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. నా పెళ్లితో నేను అస్సలు సంతోషంగా లేను, కాబట్టి నేను నా పర్సనల్ డెసిషన్ నేను తీసుకున్నాను. నేను ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను. అంతా బానే ఉంది. అలాగే కెరీర్ విషయానికి వచ్చేసరికి మూస పద్దతిలో వెళ్ళిపోతున్నానేమో అనిపించింది. అందుకే కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి పాలిటిక్స్ లోకి సేవారంగంలోకి వెళ్లాను. జనాన్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం ఉండదు. ఇన్ని రకాల రోల్స్ చేస్తూ ఇంత మంచి పేరు తెచ్చుకున్నా. సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు అదొక స్టేషన్ మాత్రమే. అన్నిటికంటే ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ నన్ను నమ్ముతున్నారు. అందుకే నాకు వాళ్ళతో పని చేయాలని ఉంది. నేను ఫిఫ్త్ జనరేషన్ తో పని చేస్తూ నేను ఫస్ట్ జనరేషన్ అని ఫీలవుతున్నా.." అన్నాడు సీనియర్ నటుడు నరేష్.
![]() |
![]() |